Hyderabad: నారాయణ కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య.. కారణం ఇదే!

|

Feb 10, 2024 | 6:59 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో శ్రీకాళహస్తికి చెందిన విజయ్‌ కుమార్ (17) అనే విద్యార్థి ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తాజాగా ఐఐటీ ఫలితాల్లో తనకు తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందిన విజయ్‌ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కాలేజీ యాజమన్యం పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని..

Hyderabad: నారాయణ కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య.. కారణం ఇదే!
Students Suicide In Narayana College
Follow us on

మాదాపూర్‌, ఫిబ్రవరి 10: నారాయణ విద్యాసంస్థకు చెందిన మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్‌ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో శనివారం (ఫిబ్రవరి 10) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో శ్రీకాళహస్తికి చెందిన విజయ్‌ కుమార్ (17) అనే విద్యార్థి ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తాజాగా ఐఐటీ ఫలితాల్లో తనకు తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందిన విజయ్‌ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కాలేజీ యాజమన్యం పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఓ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు.

కాగా నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు షరా మామూలే. ఇప్పటికే పలువురు విద్యార్ధులు ఈ కాలేజీల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. యాజమాన్యం పెట్టిన మార్కుల ఒత్తిడి తట్టుకోలేక విద్యాకుసుమాలు నేలరాలుతున్నాయి. తాజాగా మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడడటంతో కలకలం సృస్టించింది. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అఖిల భారత విద్యార్థి సంఘం ( ఏబీవీపీ) నాయకులు సంబంధిత కాలేజీ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.