AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళలు.. పాస్‌బుక్‌‌లో లెక్కలు చూడగా

మొన్న చెన్నూర్, నిన్న నర్సాపూర్, నేడు కడెం లింగాపూర్.. ఎస్బీఐలో గోల్ మాల్‌ల వ్యవహారం ఇది. సర్వం తిన్నింటి వాసాలు లెక్కెట్టే బ్యాచ్ స్కాంల భాగోతం అన్నట్టుగానే క‌నిపిస్తుంది. . తాజాగా నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ బ్రాంచ్‌లో స్వయం సహాయక సంఘాల జమ డబ్బులను నొక్కేశారు బ్యాంకు సిబ్బంది.

Telangana: డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళలు.. పాస్‌బుక్‌‌లో లెక్కలు చూడగా
Representative Image
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 20, 2025 | 1:58 PM

Share

కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో నర్సాపూర్ కాలనీ పంచాయతీకి చెందిన 16 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు డబ్బులను గత కొంతకాలం జమ చేసుకుంటున్నారు. బ్యాంకు ద్వారా వచ్చిన రుణాలను తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. అయితే ఆరు నెలలకు పైగా సంఘాల మహిళలు తమ ఖాతాల్లో పొదుపు డబ్బు ఎంత జమ అయిందో చూసుకోలేదు. ఇటీవల ఒక సంఘం సభ్యురాలు అవసరం పడి గ్రూపు ఖాతా డబ్బుల వివరాలు ఆరా తీయగా.. ఆ ఖాతాలో డబ్బు కనిపించలేదు. ఈ విషయం తెలిసుకున్న మరో మూడు గ్రూపుల సభ్యులు బ్యాంకుకు పరుగులు తీశారు. తమ ఖాతా వివరాలు ఆరా తీశారు. సేమ్ టూసేమ్ ఆ నాలుగు గ్రూపుల సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు.మహిళా గ్రూపుల ఖాతాల్లో జమ కావాల్సిన దాదాపు రూ.4.60 లక్షలను ఓ బదిలీ ఉద్యోగి తన సొంతానికి వాడుకున్నట్టు తేలింది. విషయం బయటకు పొక్కడంతో బ్యాంక్ పరువు పోకూడదని బ్యాంక్ మేనేజర్ ఆగమేఘాల మీద మహిళల ఖాతాల్లో ఆ డబ్బులను జమచేశారు. ఈ విషయం తెలియడంతో మహిళా సభ్యులు బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకులో డబ్బుకు రక్షణ లేదని తమ ఖాతాల్లోని పొదుపు డబ్బును ఇచ్చేయాలని పట్టుబట్టి మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకుని వెళ్లారు మహిళా గ్రూప్ సభ్యులు. మేనేజర్ మధు వివరణ ఇచ్చేందుకు ససేమీరా అన్నారు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే డబ్బులు జమ కాలేదని.. ప్రస్తుతం వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు. సిబ్బంది నిర్వాకంపై మాత్రం మేనేజర్ నోరు మెదపలేదు. ఓ వైపు చెన్నూర్ గోల్డ్ లోన్ గోల్‌మాల్‌లో విచారణ సాగుతుండగానే మరోసారి ఎస్బీఐపై నమ్మకం పోయేలా ఈ ఘటన వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.