Yadadri: యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Yadadri: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో

Yadadri: యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Minister Roja

Updated on: Aug 05, 2022 | 7:57 PM

Yadadri: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొన్నారు మంత్రి రోజా. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. యాదాద్రీశుడి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. శ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం సంతోషం అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తనకు మరింత ధైర్యం, రెట్టింపు ఉత్సాహాన్ని స్వామి వారు ప్రసాదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి రోజా. గతంలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తరువాత మంత్రి పదవి దక్కిందని, ఇప్పుడు మరింత శక్తిని ఇస్తారని అన్నారు.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారని ప్రశంసలు కురిపించారు. యాదాద్రీశుడి ఆలయం నిర్మించడం కేసీఆర్ పూర్వజన్మసుకృతం అని అన్నారు. భగవంతుడు తనకు నచ్చిన వారితో ఆలయం నిర్మాణం చేయించుకుంటాడని, సీఎం కేసీఆర్‌కు ఆ భాగ్యం దక్కిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us