Hyderabad: చూస్తుండగానే.. కుప్పకూలిన పురాతన భవనం.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో అధిక వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ఇటు హైదరాబాద్‌ మహానగరం వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

Hyderabad: చూస్తుండగానే.. కుప్పకూలిన పురాతన భవనం.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం
Building Collapsed

Updated on: Aug 14, 2025 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో అధిక వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ఇటు హైదరాబాద్‌ మహానగరం వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి. నాలాలు కూడా విపరీతంగా ఉప్పొంగి ప్రవహిస్తాయి. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బేగంబజార్‌లో పురాతన బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరుకున్న భవనానన్ని కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ భవన యజమాని పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. కాగా, బేగంబజార్ ప్రాంతంలో ఇలాంటి పురాతన బిల్డింగ్స్‌లోనే వ్యాపారులు షాప్స్ కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో.. కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..