Munugode Amit Shah Public Meeting: మునుగోడులో బీజేపీ సభ కొనసాగుతోంది. కొద్దిసేపట్లో అమిత్ షా సభా వేదికపైకి రానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ మీటింగ్ సక్సెస్ కావొద్దన్నదే సీఎం కేసీఆర్ కుట్ర అని అన్నారు. అందుకే ఒక రోజు ముందు సభ పెట్టుకున్నారన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు మోడీ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్ పార్టీర మద్దతా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల తపన అని అన్నారు.
ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైంది:
మునుగోడు బీజేపీ సభలో చూస్తుంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని ఈటెల అన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కమ్యూనిస్టులు మర్చిపోయారా..? ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లు రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు..? అని ప్రశ్నించారు. లెఫ్ట్ పార్టీలకు ఇవాళ కేసీఆర్ ప్రతికాముకుడిలా కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము వామపక్షాలకు ఉందా అని ఈటెల ప్రశ్నించారు. గిరిజనులపై దాడులు చేస్తుంటే ఏమైపోయారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి