Telangana: లాస్ట్ మినిట్‌లో అమిత్‌షాతో భేటీ రద్దు.. కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌పై పొలిటికల్ గుసగుసలు..

|

Jun 25, 2023 | 9:33 AM

కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌లో అసలుసిసలు మీటింగ్‌ మిస్సైంది. అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్‌ మినిట్‌లో రద్దు చేసుకున్నారు అమిత్‌షా. తీవ్ర ఉత్కంఠ రేపిన అమిత్‌షా-కేటీఆర్‌ భేటీ రద్దవడంపై గుసగుసలు మొదలయ్యాయి. అసలెందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు,

Telangana: లాస్ట్ మినిట్‌లో అమిత్‌షాతో భేటీ రద్దు.. కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌పై పొలిటికల్ గుసగుసలు..
Amit Shah And Ktr(file Photo)
Follow us on

కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌లో అసలుసిసలు మీటింగ్‌ మిస్సైంది. అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్‌ మినిట్‌లో రద్దు చేసుకున్నారు అమిత్‌షా. తీవ్ర ఉత్కంఠ రేపిన అమిత్‌షా-కేటీఆర్‌ భేటీ రద్దవడంపై గుసగుసలు మొదలయ్యాయి. అసలెందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు, ఎందుకు రద్దు చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు సడన్‌గా ఢిల్లీ వెళ్లడం, కేంద్ర మంత్రులను కలవడంపై ప్రత్యర్ధుల నుంచి పంచ్‌ల వర్షం కురుస్తోంది.

మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌ పొలిటికల్‌గా కాకరేపుతోంది. ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం, కేంద్ర మంత్రులను కలవడంపై ప్రత్యర్ధుల నుంచి పంచ్‌లు పడుతున్నాయి. బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బయటపడిదంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేయడంతో డైలాగ్‌ వార్‌ జరుగుతోంది. ఢిల్లీ టూర్‌లో ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు కేటీఆర్‌. రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌సింగ్‌తో సమావేశమై వినతిపత్రాలు అందించారు. తెలంగాణ అభివృద్ధి కోసం పలు డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందుంచారు. ప్రధానంగా ఆర్ధిక సహకారం అందించాలని విజ్ఞప్తులు చేశారు.

హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, స్కైవేస్‌ నిర్మాణం కోసం రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించారు కేటీఆర్‌. కంటోన్మెంట్‌ ఏరియాలో రక్షణశాఖ స్థలాలు ఇవ్వాలని కోరారు. అలాగే, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ విస్తరణకు ఆమోదం తెలపాలని హర్దీప్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో లింకు రోడ్ల నిర్మాణం, మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో శానిటేషన్‌ కోసం రూ. 400 కోట్లు, కారిడార్ల నిర్మాణం కోసం రూ. 800 కోట్లు, ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకి రూ. 450 కోట్లు, ఎస్టీపీల నిర్మాణం కోసం రూ. 744 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 750 కోట్ల ఆర్ధికసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక, మెరుగైన శానిటేషన్‌ కోసం చేపట్టిన సంస్కరణలను హర్దీప్‌సింగ్‌కి వివరించారు మంత్రి కేటీఆర్‌. అయితే, తెలంగాణ శానిటేషన్‌ హబ్‌ ప్రోగ్రామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు హర్దీప్‌. తెలంగాణ మోడల్‌పై ఢిల్లీలో ప్రజెంటేషన్‌ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. తెలంగాణలో చేపట్టిన పనులను చూసేందుకు హైదరాబాద్‌ రావాలని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ను ఆహ్వానించారు కేటీఆర్‌. ఇకపోతే, రబీ సీజన్‌ ధాన్యం సేకరణ, బాయిల్డ్‌ రైస్‌ ఇష్యూస్‌పై పీయూష్‌ గోయల్‌కి వినతిపత్రం అందజేశారు.

అమిత్‌షాతో భేటీ రద్దుపై గుసగుసలు..

కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌లో అసలుసిసలు ఇంట్రెస్టింగ్‌ మీటింగ్‌ చివరి క్షణంలో రద్దయ్యింది. అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్‌ మినిట్‌లో రద్దు చేసుకున్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. శనివారం రాత్రి కేటీఆర్‌కి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు అమిత్‌షా. దాంతో, అమిత్‌షా-కేటీఆర్‌ భేటీపై ఉత్కంఠ రేగింది. గతంలో ఇరువురూ ఘాటు విమర్శలు చేసుకుని ఉండటంతో ఈ ఇద్దరి మీటింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. అది కూడా నాలుగేళ్ల తర్వాత భేటీకానుండటం సంచలనం సృష్టించింది. అయితే, ఊహించనివిధంగా అపాయింట్‌మెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు అమిత్‌షా. దాంతో, అదిప్పుడు మరింత సెన్సేషన్‌గా మారింది. అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో రద్దు చేయడమేంటనే చర్చ నడుస్తోంది. పైకి బిజీ అనే కారణం చెబుతున్నా? ఏదో మతలబు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..