Siddipet: పొలంలోనే వడ్లను బియ్యంగా మార్చే హార్వెస్టర్.. సిద్ధిపేట యువకుడి ఆవిష్కరణ
సన్నవడ్లను పండించుకునే రైతుల కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ అనే యువకుడు అదిరిపోయే ఆవిష్కరణ చేశాడు. ఇక నుంచి రైతులు రైస్ మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే. తమ పొలంలోనే వడ్లు కోసిన వెంటనే వాటిని బియ్యంగా మార్చేలా..
![Siddipet: పొలంలోనే వడ్లను బియ్యంగా మార్చే హార్వెస్టర్.. సిద్ధిపేట యువకుడి ఆవిష్కరణ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/siddipet.jpg?w=1280)
సిద్ధిపేటకు చెందిన ఓ యువకుడు అద్భుత ఆవిష్కరణ చేశాడు. సాధారణంగా హార్వెస్టర్లను పొలం నుంచి వడ్లను సేకరించడంలో ఉపయోగపడతాయి. అనంతరం వడ్లను బియ్యంగా మార్చడానికి రైస్ మిళ్లకు తరలించాల్సి ఉంటుంది. అలా కాకుండా పొలంలోనే వడ్లను నేరుగా బియ్యం మార్చే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.? ఈ ఆలోచన నుంచే సిద్ధిపేటకు చెందిన ఓ యువకుడు అద్భుత ఆవిష్కరణ చేశాడు.
సన్నవడ్లను పండించుకునే రైతుల కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ అనే యువకుడు అదిరిపోయే ఆవిష్కరణ చేశాడు. ఇక నుంచి రైతులు రైస్ మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే. తమ పొలంలోనే వడ్లు కోసిన వెంటనే వాటిని బియ్యంగా మార్చేలా హార్వెస్టర్ లో మార్పులు చేశాడు. గత సంవత్సరన్నర కాలంగా కష్టపడ్డ తాను చివరికి టూ ఇన్ వన్ హార్వెస్టర్ను తయారు చేసినట్లు తెలిపారు.
ఈ హార్వెస్టర్ తయారీకి 30 వేల వరకు డబ్బులు ఖర్చు అవ్వగా, దాని ద్వారా ప్రస్తుతం కొంత వడ్లను కోయడంతో పాటు అక్కడే ఆ వడ్ల నుంచి బియ్యంను బయటికి తీయడం జరుగుతుందని తెలిపాడు. తాను చేసిన ఈ చిన్న ప్రయోగం సక్సెస్ అయ్యింని, ఇది గనుక పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇలాంటి హార్వెస్టర్‌ను తయారు చేస్తే తద్వారా రైతులకు ఆటో కిరాయిలు, ట్రాక్టర్ కిరాయిలు, రైస్ మిల్లులకు వెళ్లే బాధ తప్పుతుందని తెలిపాడు. కాగా టూ ఇన్ వన్ హార్వెస్టర్ను తయారు చేయడం పై అమరేందర్‌ను పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..