Telangana: త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పక్కన ఉన్నా కూడా ఆ 20మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పక్కన ఉన్నా కూడా ఆ 20మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. ప్రజలకు బాగా సేవ చేయాలని, మంచి పేరు తెచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు అట్రాక్ట్ అవుతారని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తారంటూ గతంలోనూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి అదే రకమైన కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని జగ్గా రెడ్డి అన్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని గడ్డపారతో పొడిచారని.. కనీసం తాము సూదితో అయినా పొడవకూడదా? అని ప్రశ్నించారు. అయితే తాము బీఆర్‌ఎస్ వాళ్లంత మూర్ఖులం కాదన్నారు.
రాజకీయంగా కొన్ని తమకు తప్పదన్న జగ్గా రెడ్డి.. బీఆర్‌ఎస్ చేసిన అలవాటే తాము కొనసాగిస్తామన్నారు.
మర్యాదపూర్వకంగా అంటూ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యవహారం రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. అటు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలోని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తారని జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.