Telangana: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. రూ.9500 కోట్లతో అమర్‌రాజా లిథియం ఫ్యాక్టరీ..

|

Dec 02, 2022 | 9:45 PM

తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. లేటెస్ట్‌గా రాష్ట్రంలో భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది అమర్‌రాజా. ఇక నుంచి ఎలక్ట్రికల్ హబ్‌గా హైదరాబాద్ మారబోతోంది మంత్రి కేటీఆర్..

Telangana: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. రూ.9500 కోట్లతో అమర్‌రాజా లిథియం ఫ్యాక్టరీ..
Amararaja Group
Follow us on

తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. లేటెస్ట్‌గా రాష్ట్రంలో భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది అమర్‌రాజా. ఇక నుంచి ఎలక్ట్రికల్ హబ్‌గా హైదరాబాద్ మారబోతోంది మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 9500 కోట్ల రూపాయలతో 16 GWH అమర్‌రాజా లిథియం ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి అమ‌ర‌రాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో జరిగిన ఆమ్టెక్‌ ఎక్స్‌పోలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, అమ‌ర‌రాజా గ్రూప్ డైరెక్టర్ గ‌ల్లా జ‌య‌దేవ్ పాల్గొన్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 4,500 మందికి ఉపాధి అవ‌కాశాలు లభించనున్నాయి. పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చిన అమర్‌రాజాకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అమ‌ర‌రాజా కంపెనీకి అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని స్పష్టం చేశారు. పెట్టుబడుల‌కు తెలంగాణ అనుకూల‌మైన ప్రదేశ‌మ‌న్నారు అమర్ రాజా మేనేజింగ్ డైరెక్టర్ గ‌ల్లా జ‌య‌దేవ్. వ‌చ్చే 10 ఏళ్లలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబ‌డులు పెట్టబోతున్నామ‌ని జ‌య‌దేవ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు కేపీహెచ్‌బీ కాల‌నీలోని ఫేజ్ -9లో నిర్మించిన ఇండోర్ ష‌టిల్ కోర్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి షటిల్ ఆడారు. అంతే కాకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..