Nirmal District: ఓరి దేవుడో.. అంగన్‌వాడీ సెంటర్‌లో విచిత్ర కోడిగుడ్లు.. ! బండకేసి కొడితే బంతిలా లేస్తన్నాయ్‌..

|

Jun 29, 2022 | 3:27 PM

కొందరు దళారులు, వ్యాపారులు కుమ్మకై ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా ఇదంతా..

Nirmal District: ఓరి దేవుడో.. అంగన్‌వాడీ సెంటర్‌లో విచిత్ర కోడిగుడ్లు.. ! బండకేసి కొడితే బంతిలా లేస్తన్నాయ్‌..
Plastic Eggs
Follow us on

Nirmal plastic eggs:   నిర్మల్‌ జిల్లాలో భైంసాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భైంసా పట్టణంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల కోసం పంపిణీ చేసిన కోడిగుడ్లు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. అంగన్‌వాడి సెంటర్‌లో పంపిణీ చేసిన కోడిగుడ్లను ఉడకబెట్టి తినబోతే.. రబ్బరులా సాగుతున్నాయి. అదేంటని తీరా నెలకేసి కొడితే, కోడిగుడ్లు బంతిలా ఎగురుతున్నాయి. దీంతో వినియోగదారులు షాక్‌ అయ్యారు. వెంటనే ఇంట్లోని ఉన్న అంగన్‌ సెంటర్‌ నుంచి తీసుకొచ్చిన మిగిలిన గుడ్లు చెక్‌ చేయగా, అవి కూడా లోపలంతా విచిత్రంగా జిగురులాంటి పదార్థం కనిపించింది. దాంతో బాధితులంతా వాపోయారు.. ఇదేక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.

పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీల కు అందించే పోషకాహారంలోనూ కల్తీ చేస్తున్నారని, ప్లాస్టిక్ గుడ్లు సరఫరా చేశారని స్థానికులు ఆరోపించారు. కొన్ని గుడ్లు ఉడకబెట్టిన తర్వాత నల్లగా మారడంతో ప్రజలు షాక్‌ అయ్యారు. కోడి గుడ్లను ఉదగబెడితే స్పాంజ్ లాగా సాగుతున్నాయని, కొందరు దళారులు, వ్యాపారులు కుమ్మకై ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, దీనిపై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా ఇదంతా తమ దృష్టికి రాలేదని అన్నారు. ప్లాస్టిక్‌ గుడ్లు కలకలంపై విచారణ చేపడుతామని వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి