Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా.? వెంటనే ఇలా చేయండి లేదంటే, సరుకులు అందవు

రేషన్ కార్డులో పేరు ఉండి మరణించడం లేదా ఆడ పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడం, కొందరు పెళ్లిళ్లు జరిగి కుటుంబాలు విడిపోవడం వంటివి జరుగుతున్నాయని. ఇలాంటి వారికి రేషన్‌ సరుకులు ఇవ్వడం ఎందుకున్న నేపథ్యంలో ఈ కేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కేవైసీ అప్‌డేట్ చేసుకోని వారికి రేషన్‌ సరుకులు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని....

Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా.? వెంటనే ఇలా చేయండి లేదంటే, సరుకులు అందవు
Ration Card

Updated on: Sep 14, 2023 | 5:30 PM

రేషన్‌ సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌ సరుకులు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రేషన్‌ కార్డులో ఉన్న ప్రతీ ఒక్కరూ కేవైసీని చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ దుకాణాల్లో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పాస్‌ మిషన్‌ ద్వారా కేవైసీ అప్‌డేట్‌ చేయనున్నారు. వీలైనంత త్వరగా కేవైసీ అప్‌డేట్ చేపట్టాలని రేషన్‌ డీలర్లను అధికారులు ఆదేశించారు.

రేషన్ కార్డులో పేరు ఉండి మరణించడం లేదా ఆడ పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడం, కొందరు పెళ్లిళ్లు జరిగి కుటుంబాలు విడిపోవడం వంటివి జరుగుతున్నాయని. ఇలాంటి వారికి రేషన్‌ సరుకులు ఇవ్వడం ఎందుకున్న నేపథ్యంలో ఈ కేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కేవైసీ అప్‌డేట్ చేసుకోని వారికి రేషన్‌ సరుకులు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ కేవైసీ ఎలా అప్‌డేట్‌ చేయాలంటే..

* రేషన్‌ కార్డులో ఉన్న ప్రతీ ఒక్క సభ్యుడు సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్‌’ మిషన్‌లో వేలి ముద్రలు ఇవ్వాలి.

* అనంతరం వేలి ముద్ర తీయగానే సదరు వ్యక్తి ఆధార్‌ కార్డు నెంబర్‌తో పాటు రేషన్‌ కార్డు నెంబర్‌ డిస్‌ప్లే అవుతుంది. ఒకవేల ఆధార్‌, రేషన్‌ కార్డులో వివరాలు సరిపోతే గ్రీన్‌ లైట్‌ వచ్చి కేవైసీ పూర్తవుతుంది.

* అలాకాకుండా రేషన్‌ కార్డులో, ఆధార్‌ కార్డులో సమాచారం వేరేలా ఉంటే వెంటనే రెడ్‌ లైట్‌ ఆన్‌ అవుతుంది. దీంతో సదరు వ్యక్తిని ఆ రేషన్‌ కార్డు నుంచి తొలగిస్తారు.

* ఒకవేళ రేషన్‌ కార్డులో ఉన్న వ్యక్తులు కేవైసీ చేయించుకోకపోతే వారిని సెపరేట్ యూనిట్‌గా భావించి రేషన్‌ కార్డు నుంచి పేరును తొలగిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..