తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికను సోమవారం నియమించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త జారీ చేశారు. అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం హారికకు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అలేఖ్యకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి.
యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన హారిక.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే హారిక బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టంట్‌లలో ఒకరుగా నిలిచి.. స్ట్రాంగ్ విమెన్‌గా సత్తా చాటింది. సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారికకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కాగా, హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమె యాస, భాష పక్కా తెలంగాణ స్టైల్లో ఉంటాయి. ఇదిలాఉంటే.. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియామకం అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ప్రస్తుతం తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది.
Also Read: బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్.. కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు..
‘సామజవరగమన’ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు అవమానం.. ఒంటిపై మద్యం, వాటర్ పోసి..
ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…