Telangana: కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సీనియర్లతో కొనసాగుతున్న దిగ్విజయ్‌ భేటీ.. వాట్స్‌ నెక్స్ట్‌..

|

Dec 22, 2022 | 2:00 PM

తెలంగాణ కాంగ్రెస్ లోని విబేధాలకు చెక్ పెట్టేందుకు గాంధీభవన్‌లో ఫేస్‌ టు ఫేస్‌ మీటింగ్‌లు కంటిన్యూ అవుతున్నాయి. సేవ్‌ కాంగ్రెస్‌ వాదులతో, మిగిలిన నేతలతో వన్‌ బై వన్‌ మాట్లాడుతున్నారు హైకమాండ్‌ దూత దిగ్విజయ్‌ సింగ్‌.

Telangana: కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సీనియర్లతో కొనసాగుతున్న దిగ్విజయ్‌ భేటీ.. వాట్స్‌ నెక్స్ట్‌..
Telangana Congress
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ లోని విబేధాలకు చెక్ పెట్టేందుకు గాంధీభవన్‌లో ఫేస్‌ టు ఫేస్‌ మీటింగ్‌లు కంటిన్యూ అవుతున్నాయి. సేవ్‌ కాంగ్రెస్‌ వాదులతో, మిగిలిన నేతలతో వన్‌ బై వన్‌ మాట్లాడుతున్నారు హైకమాండ్‌ దూత దిగ్విజయ్‌ సింగ్‌. పార్టీలో పరిణామాలపై తీవ్ర విమర్శలు చేసిన G9 నేతలతో ఉదయం నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ కొనసాగుతోంది. తొలుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో, వీహెచ్‌ హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, అనంతరం రేణుకాచౌదరితో ఫేస్‌ టు ఫేస్‌ భేటీ అయ్యారు. అయితే ఆయనకు G9 నేతలు సీక్రెట్‌ రిపోర్టులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తమ విమర్శలకు ఆధారాలతో సహా.. నేతలు దిగ్విజయ్ సింగ్ కు రిపోర్టు అందజేసినట్లు పేర్కొంటున్నారు.

గతన కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలను దిగ్విజయ్‌కు వివరించినట్లు దామోదర రాజ నర్సింహ తెలిపింది. గాంధీభవన్‌కు రాకుండా హోటల్‌లోనే దిగ్విజయ్‌ను కలిశారు జగ్గారెడ్డి. తాను చెప్పాల్సినవన్నీ చెప్పానని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ తాను గాంధీభవన్‌లో కలబోనని.. పార్టీలో పరిస్థితులన్నీ వివరించానని చెప్పారు. దిగ్విజయ్‌ అంటేనే పొలిటికల్‌ ఫార్ములా అని, కచ్చితంగా సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తున్నానన్నారు జగ్గారెడ్డి.

దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అనంతరం వీహెచ్‌ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్లకు గౌరవం ఇవ్వాలని చెప్పానన్నారు. సోషల్‌ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను చెప్పిన సమాధానాలకు దిగ్విజయ్‌ సింగ్‌ బాగానే రెస్పాండ్‌ అయ్యారని వీహెచ్‌ తెలిపారు.

పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, ఏకాభిప్రాయం కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు మల్లు రవి. మెజార్టీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామన్నారు. దిగ్విజయ్‌ భేటీల నేపథ్యంలో మల్లు రవి ఈ వ్యాఖ్యలు చేశారు.

గాంధీభవన్‌లో వరుస మీటింగ్‌లతో సందడి నెలకొంది. ముందు PAC కమిటీతో, తర్వాత అసంతృప్త నేతలతో మీటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడేందుకు ఒక్కో నేతకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ క్రమంలో సీనియర్‌ నేతలతో మరికొంత సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి.. టీపీసీసీ సీనియర్ నేతల మధ్య నెలకొన్న గొడవలకు చెక్ పెట్టేందుకు దిగ్విజయ్ పూర్తి డేటా కలెక్ట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..