Disha Encounter: ఆ నివేదికకు అంత ప్రాధాన్యత అవసరంలేదు.. అన్నీ లోపభూయిస్టమే..
Disha Encounter: దిశా ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు అంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఆ కేసులో పోలీసుల..
Disha Encounter: దిశా ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు అంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఆ కేసులో పోలీసుల తరపున వాదించిన న్యాయవాది కీర్తి కిరణ్. కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలూ లోప భూయిష్టంగా ఉన్నాయన్నారు ఆయన. ఈ కేసులో పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదు అన్నట్లుగానే కమిషన్ నివేదిక ఉందని చెప్పారు. పరస్పర కాల్పుల్లో దిశా కేసు నిందితులు మరణించారనీ, ఎన్ కౌంటర్లో మరణించిన నలుగురికి నేరచరిత్ర లేదని, తుపాకీ పేల్చడం కూడా రాదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. నేరచరిత్ర ఉన్నవాళ్లే నేరం చేయాలని ఎక్కడా లేదని అన్నారు. సినిమాలు చూసి కూడా తుపాకులు పేలుస్తున్నారనీ, ఆ నలుగురే దిశను అత్యాచారం చేసి, హత్య చేశారు అనడానికి పోలీసులు వద్ద పకడ్బందీ సాక్షాదారాలు ఉన్నాయన్నారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలన్న కమిషన్ పేర్కొనడం సాధారణమే అని తెలిపారు. గతంలోనూ కొన్ని ఎన్ కౌంటర్ కేసుల్లో ఇలానే జరిగిందని చెప్పారు. దీనిని హైకోర్టులో సవాల్ చేస్తామని తెలియజేశారు అడ్వకేట్ కీర్తి కిరణ్.