Telangana: శృతిమించిన లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు.. మొబైల్ హ్యాక్ చేసి మరీ వేధింపులు..

|

Sep 26, 2022 | 10:05 AM

Telangana: లోన్ యాప్ కేటుగాళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇప్పటివరకూ యాప్ ద్వారా లోన్ తీసుకొని చెల్లించలేకపోయిన వారిని వేధించేవాళ్లు..

Telangana: శృతిమించిన లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు.. మొబైల్ హ్యాక్ చేసి మరీ వేధింపులు..
Money Loan Apps
Follow us on

Telangana: లోన్ యాప్ కేటుగాళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇప్పటివరకూ యాప్ ద్వారా లోన్ తీసుకొని చెల్లించలేకపోయిన వారిని వేధించేవాళ్లు.. ఇప్పుడు అసలు లోను తీసుకోకపోయినా మొబైల్ ను హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. సన్నిహితులు బంధువులకు అభ్యంతరకర మెసేజ్‌లు ప్రైవేట్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కోసం టార్చర్ పెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి శీమకుర్తి రవికుమార్ మొబైల్ ను హ్యాక్ చేసిన దుండగులు లోన్ యాప్ పేరిట అభాసుపాలు చేస్తున్నారు.

రవికుమార్ అనే వ్యక్తి వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.1700 లోన్ తీసుకున్నట్లుగా.. ఏడు రోజుల కాలపరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతరమైన మెసేజ్ లతో వేధించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా అసలు రూ. 1700, వడ్డీ రూ. 1300 మొత్తం 3000 రూపాయలు చెల్లించాలంటూ వేధించారు. అంతే కాకుండా ఫోటో మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లోన్ యాప్ కేటుగాళ్లపై సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..