Adilabad: ఇంద్రవెల్లిలో రోడ్డెక్కిన ఆదివాసీలు.. న్యాయం కోసం పోరాటం..

|

Jul 03, 2023 | 3:01 PM

ఆపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు...ఐతే నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు..

Adilabad: ఇంద్రవెల్లిలో రోడ్డెక్కిన ఆదివాసీలు.. న్యాయం కోసం పోరాటం..
Degree Student Suicide
Follow us on

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తమ ఆదివాసీల్లోని ఓ మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై అడవి బిడ్డలు భగ్గుమన్నారు. నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్‌ చేశారు. NTR చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే శిక్షించాలని పట్టుబట్టారు. దీంతో స్థానికంగా కాసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

జూన్‌ 20న ఆదిలాబాద్‌ జిల్లా దనోరా బస్టాండ్ సమీపంలో ఒంటరిగా ఉన్న జంగుబాయి అనే మహిళను మాయమాటలు చెప్పి అదే జిల్లాకు చెందిన ముగ్గురు అత్యాచారం చేశారని ఆదివాసీలు ఆరోపించారు. ఆపై ఆమె గొంతునులుమి బావిలో పడేశారని వాపోయారు.వ్యవసాయ కూలీలు బావిలోనుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెళ్లి చూశారు.. అక్కడ వారికి మృతదేహం కనిపించింది.

దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆదివాసీల సాయంతో బావిలో నుంచి మహిళ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు…ఐతే నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం