ఛీ.. ఛీ.. చిన్నోళ్లే కానీ.. నీచమైన పని చేశారు.. స్నేహం పేరుతో దగ్గరై ఆపై ఏం చేశారంటే

ఇదో షాకింగ్ ‌న్యూస్‌..! వినడానికి.. చెప్పడానికి మాటలు రానంత దారుణమైన ఘటన.. ఓ బాలిక జీవితంతో ఏకంగా 12 మంది చెలగాటం ఆడిన అమానుషమైన వికృత క్రీడ..! కీచకుల్లా వేధిస్తున్న బ్యాచ్‌పై చివరికి బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ఛీ.. ఛీ.. చిన్నోళ్లే కానీ.. నీచమైన పని చేశారు.. స్నేహం పేరుతో దగ్గరై ఆపై ఏం చేశారంటే
Crime News

Edited By: Ram Naramaneni

Updated on: Jun 22, 2025 | 2:48 PM

అడవుల జిల్లా ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌ మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహం పేరుతో బాలికకు దగ్గరై ఆమె జీవితంతో చెలగాటం మొదలెట్టాడో మైనర్‌.. ఫ్రెండ్‌గా నటిస్తూ చాటింగ్‌చేస్తూ క్రమంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌ మొదలుపెట్టాడు.. చివరకు తాను చెప్పినట్టు చెయ్యకపోతే మొత్తం చాటింగ్‌ వైరల్‌ చేస్తానని బెదిరించాడు. తనకు అశ్లీలంగా కాల్స్ చేసి మాట్లాడాలన్నాడు. లేదంటే పరువు మొత్తం తీస్తానని బెదిరించారు. తర్వాత ఆ వీడియో కాల్స్‌ రికార్డ్ చేసి వాటిని తన స్నేహితులకూ షేర్ చేశాడు. ఒకడు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది ఈ వీడియోలు షేర్ చేసుకుని పైశాచిక ఆనందం పొందారు. బాలికకు నెక్స్ట్ లెవెల్‌ టార్చర్‌ చూపించారు. తర్వాత బాలిక పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వీడియోనూ సోషల్‌ మీడియాలో పెట్టారు. చివరికి ఆ మైనర్ ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేట మొదలెట్టారు. ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు మైనర్‌ కావడం, అతనితో కలిసి మిగతా వాళ్లు బాలికను తీవ్రంగా వేధించడంపై కేసు నమోదు చేసి.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీడియోల్ని వెంటనే డిలీట్‌ చేయించి చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో మైనర్ బాలికకు పరిచయమై.. స్నేహం పేరిట వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం స్నేహితుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీడియోలు షేర్ చేసుకున్న ఆ బాలుడి స్నేహితులు సైతం బాలికను వేధించడం ప్రారంభించడంతో.. ఆమె ఈ విషయాన్ని తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.. దీంతో బాలికను వేధించిన 8 మందిని (ఆరుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు ) అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని.. విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు..

పిల్లల కదలికల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి -ఆదిలాబాద్ జిల్లా పోలీసులు..

పిల్లల కదలికల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.. పిల్లల స్మార్ట్ ఫోన్ వాడకంపై నిఘా ఉంచాలని, వారి సామాజిక మధ్యామలపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు.. స్నేహం పేరిట మొదలయ్యే పరిచయాలు అన్ని స్వచ్ఛమైనవి కావని, బాలికలను మానసికంగా లోబర్చుకుని తరువాత వేధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.. వేధింపులకు గురవుతున్న బాలికలు, అమ్మాయిలు భయం వీడి పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భరోసానిచ్చారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..