Late Marriage: ఆయనకు 73…ఆమెకు 26.. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు..!

Old Man Marriage: ఇద్దరు వదువరులు. ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయిన మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవలనుకున్నారు.

Late Marriage: ఆయనకు 73...ఆమెకు 26.. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు..!
Marriage

Updated on: Oct 14, 2021 | 10:36 AM

Old Man Marriage: ఇద్దరు వదువరులు. ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయిన మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవలనుకున్నారు. ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరి పెళ్లి చేశారు. ఈ వివాహం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో జరిగింది. ఇద్దరికి ఇది రెండో వివహమే.

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింత కుంట తండా కు చెందిన రాథోడ్ కిషన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.. అందరికి పెళ్లిలు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కిషన్ భార్య గతంలో అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుండి ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు. కుభీర్ మండలం రంజని తండా కు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు ఒక పాపా కూలి పని చేస్తూ పాపను పోషించుకుంటోంది.. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్ , సునీత పరస్పరం పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని విషయాన్ని తమ తమ కుటుంబ సభ్యులకు చెప్పగా వారి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు.

Also read:

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Digital India Corporation: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..