Adibatla Kidnap case: ఆదిభట్ల కిడ్నాప్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో మరో షాకింగ్ విషయం..

|

Dec 11, 2022 | 1:36 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల కిడ్నాప్‌ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితుడైన మిస్టరీ టీ యాజమాని నవీన్‌రెడ్డి, అతనికి సహకరించిన వారిని పోలీసులు విచారణ చేపట్టారు.

Adibatla Kidnap case: ఆదిభట్ల కిడ్నాప్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో మరో షాకింగ్ విషయం..
Naveen
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల కిడ్నాప్‌ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితుడైన మిస్టరీ టీ యాజమాని నవీన్‌రెడ్డి, అతనికి సహకరించిన వారిని పోలీసులు విచారణ చేపట్టారు. వైశాలి-నవీన్‌ ఎపిసోడ్‌పై పోలీసులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. అయితే, ఆదిభట్ల కిడ్నాప్‌ కేసులో మొదటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు. బాధితురాలు వైశాలి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా నవీన్‌రెడ్డి వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు వైశాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇవాళ మరోసారి రికార్డ్‌ చేయనున్నట్లు సమాచారం. నవీన్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్‌, గొడవలు, టూర్‌పై వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

పోలీసుల విచారణలో నవీన్‌రెడ్డి వ్యవహారంపై కొత్త ట్విస్టులు బయటకొస్తున్నట్లు సమాచారం. వైశాలి కోసం కొంతకాలంగా కాలనీలోనే తిష్టవేసిన నవీన్‌, స్థానికులను కూడా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు కూడా ఈవిషయంపై నవీన్‌ను నిలదీసినట్లు తెలుస్తోంది. అయితే కాలనీవాసులతో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ కేసులో కాలనీవాసుల స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డ్‌ చేయనున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే తమ ఇంటిపై దాడి చేశారని, నవీన్‌ నుంచి రక్షణ కల్పించాలని వైశాలి ఫ్యామిలీ కోరుతోంది.

పోలీసుల అదుపులో ఉన్న నవీన్‌రెడ్డి, అతనికి సహకరించిన 32 మందిని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైశాలి-నవీన్‌రెడ్డికి పెళ్లైందా? రెండు కుటుంబాలు కలిసి ఎక్కడెక్కడ టూర్‌కి వెళ్లారు? పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికి చెప్పొద్దని వైశాలి కండీషన్‌ పెట్టిందా? నవీన్‌రెడ్డి చెప్పిన దాంట్లో నిజమెంత? వైశాలి, ఆమె పేరెంట్స్‌ చెబుతున్నదానిలో నిజమెంత? అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైశాలి, కాలనీవాసుల స్టేట్‌మెంట్‌..నవీన్‌రెడ్డి, అతని సహకరించిన వారిని విచారించిన తర్వాత పోలీసులు ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే మీడియాకు వివరాలు వెల్లడించే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..