Telangana: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊహించని షాక్..

|

Oct 28, 2024 | 7:09 AM

తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసనకు దిగిన తెలంగాణ స్పెషల్ పోలీస్(టీజీఎస్పీ) సిబ్బంది‌పై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 39 మందిని సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా అందులో నుంచి 10 మందిని డిస్మిస్ చేస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊహించని షాక్..
Telangana Police Suspends
Follow us on

విధులు బహిష్కరిస్తూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని రోడ్డు ఎక్కిన తెలంగాణ స్పెషల్ పోలీస్(టీజీఎస్పీ) సిబ్బంది‌పై రాష్ట్ర ప్రభుత్యం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలా రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేయడం నిబంధనలకు విరుద్ధుమని ప్రభుత్వం గరం అయింది. ఆందోళనలో పాల్గొన్న 39 మందిని సస్పెండ్ చేయాగా, వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు.

తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) క్రమశిక్షణను పటిష్టం చేయడానికి ప్రధాన విలువలను నిలబెట్టడానికి, హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక ఆందోళనలు సమ్మెలలో పాల్గొన్నందున కొంతమంది సిబ్బందిని సర్వీస్ నుండి తొలగిస్తున్నాం” అని ప్రెస్ నోట్ విడుదల చేసింది.

విధులు విఘాతం కలిగించిన కొందరు బెటాలియన్ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకంటున్నామని, విధులు బహిష్కరించి పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినందుకు దానికి పర్యవసానంగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(బి) ప్రకారం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించినందుకు వారి తొలగింపుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి