AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బైక్‌ను ఢీకొన్న నటుడు రఘుబాబు కారు.. BRS నేత మృతి… వీడియో

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి చెందాడు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావుగా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Telangana: బైక్‌ను ఢీకొన్న నటుడు రఘుబాబు కారు.. BRS నేత మృతి... వీడియో
Raghu Babu Car Accident
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2024 | 9:55 PM

Share

నల్గొండ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తూ ఓ బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నల్గొండ నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావుగా పోలీసులు గుర్తించారు. నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు,  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) BRS టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు.  ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్డుండేవాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న KA 03  MP 69 14 నెంబర్ గల BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంగా తెలిసింది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు.

అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడటం దిగువన వీడియోలో చూడొచ్చు. అయితే రఘుబాబు టెన్షన్ పడుతూ ఉండగా.. పక్కన ఉన్న వ్యక్తులు వాటర్ తాగమని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..