Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో చిలకల గూడ పోలీసులు శుక్రవారం రాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన ఈ కేసులో మల్లన్నకు రెండు సార్లు నోటీసులు ఇచ్చామని.. ఇప్పటికే విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారికంగా ధృవీకరించింది.
తీన్మార్ మల్లన్న డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మధురానగర్‌లో ‘మారుతీ జ్యోతిష్యాలయం’ అనే ఓ సంస్థను లక్ష్మీకాంతశర్మ నిర్వహిస్తున్నారు. ఇటీవల తనకు వ్యతిరేకంగా మల్లన్న తన యూట్యూబ్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్నని ఈరోజు ఉదయం కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నట్లు తెలిపారు. బ్లాక్ మెయిలింగ్ అండ్ ఎక్స్టారష్యన్ కేసులో మల్లన్న అరెస్ట్ అయ్యాడు.
Also Read: అలరిస్తున్న సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’..