ఓటుకు నోటు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు.. అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

|

Dec 19, 2020 | 8:05 AM

ఓటుకు నోటు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరై అరెస్టైన ఉదయ్ సింహకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రిమాండ్...

ఓటుకు నోటు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు.. అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..
Follow us on

ఓటుకు నోటు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరై అరెస్టైన ఉదయ్ సింహకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రిమాండ్ నుండి బయటకు వచ్చారు. అసలేం జరిగిందంటే.. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. అయితే ఏ-3 గా ఉన్న ఉదయ్ సింహ మాత్రం కోర్టు విచారణకు హాజరు కాలేదు. దాంతో ఏసీబీ కోర్టు ఉదయ్ సింహపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఆ వారెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ఆయన్ను బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఏసీబీ కోర్టులో ఉదయ్ సింహ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఉదయ్ సింహ ఏసీబీ రిమాండ్ నుంచి విడుదల అయ్యారు.

 

Also read:

ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్.. ఖాళీల వివరాలు సేకరించిన సీఎస్..

విజయవాడలో తాగుబోతు వీరంగం.. కరెంటు పోల్ ఎక్కి హల్ చల్.. కిందికి దింపి స్టేష‌న్‌కు తరలించిన పోలీసులు