Telangana: ఆమ్యామ్యా తీసుకుంటూ.. అడ్డంగా బుక్కైన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో

|

Aug 19, 2024 | 11:54 AM

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్​ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్​లీజుకు తీసుకుని..

Telangana: ఆమ్యామ్యా తీసుకుంటూ.. అడ్డంగా బుక్కైన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో
ACB arrests Musalamma Jathara Temple EO
Follow us on

కొత్తగూడ, ఆగస్టు 19: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్​ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్​లీజుకు తీసుకుని కిరాణం, కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల షాపులో గుట్కాలు, మద్యం దొరకడంతో షాపును సీజ్​ చేశారు. అయితే ఎండోమెంట్​కమీషనర్​కార్యాలయంలో రూ.20 వేల ఫైన్​చెల్లిస్తే షాపు లైసెన్స్​పునరుద్ధరిస్తామని ఆలయ భిక్షమాచారి చెప్పారు. అయితే జరిమానాతోపాటు మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాలని సాంబయ్యను​డిమాండ్‌ చేశాడు ఈవో భిక్షమాచారి.

దీంతో విసుగుచెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఆదివారం ఆలయ ఆవరణలో రూ.20 వేలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్షలు చేయగా.. నిందితుడి కుడి చేతి వేళ్లకు, లంచం డబ్బు దాచిన క్యాష్ కౌంటర్ డ్రాయర్‌లో కెమికల్ నమూనాలు ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా భిక్షామాచారి స్వగ్రామమైన మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.70 వేల నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం, కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ఏసీబీ సీఐ ఎస్‌ రాజు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ఎస్‌ రాజుతో పాటు ఏసీబీ సీఐ శ్యామ్​సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.