Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండకు చెందిన యువకుడి దుర్మరణం.. స్వగ్రామంలో విషాదఛాయలు..

|

Nov 22, 2021 | 6:08 PM

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎల్లికాట్‌ నగరంలో ఈ నెల 19న జరిగిన ప్రమాదంలో గుర్రంపోడు మండలం

Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండకు చెందిన యువకుడి దుర్మరణం.. స్వగ్రామంలో విషాదఛాయలు..
Follow us on

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎల్లికాట్‌ నగరంలో ఈ నెల 19న జరిగిన ప్రమాదంలో గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన శేఖర్‌ చనిపోయాడని అక్కడి అధికారులు తెలియజేశారు. కాగా శేఖర్‌ వయసు 28 సంవత్సరాలే. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాగా చేతికందిన కుమారుడు ఇలా దేశం కాని దేశంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై శేఖర్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని స్వదేశం తీసుకురావాలని కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

శేఖర్‌ మరణవార్తను అక్కడి అధికారులు ఫోన్‌ ద్వారా అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న శేఖర్‌ మరణవార్తతో తెరాటి గూడెంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. అతడి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీలైనంత త్వరగా శేఖర్‌ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Also Read:

Drugs Door Delivery: హైదరాబాద్‌ మీదుగా మాదకద్రవ్యాల రవాణా.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా విదేశాలకు..

Lifestyle Tips: మీరు మరింత ఫ్యాషన్ లుక్‌లో కనిపించాలంటే వీటిని మరిచిపోవద్దు..

Tomato Price Hike: ఆల్ టైం హైకి టమాటా ధర.. చికెన్‌తో పోటీపడుతున్న కూరగాయలు.. సామాన్యుడి కంట కన్నీరు