Telangana: తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వాలన్న కూతురు.. తండ్రి ఒప్పుకోకపోవడంతో.. చివరికి

కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు అడిగింది కొనిచ్చేవరకు ఊరుకోరు. తమకు కావాల్సింది దక్కించుకునేవరకు పట్టుబడతారు. మరికొందరైతే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Telangana: తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వాలన్న కూతురు.. తండ్రి ఒప్పుకోకపోవడంతో.. చివరికి
Death

Updated on: Jun 18, 2023 | 8:27 PM

కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు అడిగింది కొనిచ్చేవరకు ఊరుకోరు. తమకు కావాల్సింది దక్కించుకునేవరకు పట్టుబడతారు. మరికొందరైతే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తండ్రి ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా రాయకోడ్‍లో అంజలి (14) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఆమె 9వ తరగతి చదువుతోంది.

అయితే అంజలికి సొంతంగా సెల్‌ఫోన్ లేకపోవడంతో.. తన నాన్నను ఫోన్ కొనివ్వమని అడిగింది. అయితే ఇందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఎలాగైన కొనివ్వాలంటూ అంజలీ ఒత్తిడి చేసింది. అయినప్పటికీ తండ్రి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. చివరికి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంజలీ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కూతురు మరణంతో ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..