Car Accident: చిట్టాపూర్‌ కారు ప్రమాదంలో ట్రాజడీ.. సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి..

|

Dec 01, 2021 | 8:51 PM

చిట్టాపూర్‌ శివార్లలో నేల బావిలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో విషాదం జరిగింది. కారును బయటకు..

Car Accident: చిట్టాపూర్‌ కారు ప్రమాదంలో ట్రాజడీ.. సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి..
Car Tragedy
Follow us on

Chittapur Car Accident: చిట్టాపూర్‌ శివార్లలో నేల బావిలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో విషాదం జరిగింది. కారును బయటకు తీసే క్రమంలో ఓ గజ ఈతగాడు కూడా మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  దాదాపు 10 మంది గజ ఈతగాళ్లు కారును బయటకు తీసేందుకు 8 గంటలు శ్రమించారు. బావి లోపలికి వెళ్లి కారుకు తాడుకట్టి బయటకు తీసుకొచ్చే క్రమంలో మృతి చెందాడు ఇనగుర్తి గ్రామానికి చెందిన నర్సింహులు అనే గజఈతగాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ కారుకు కట్టిన తాడు పైనే కూలిపోయాడు నర్సింహులు.

నర్సింహులు బావి అడుగున కారుకు తాడు క్రమంలో ఊపిరాడక చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. సాయం చేద్దామని వచ్చిన నర్సింహులు మృతిచెందడంతో ఇనగుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిట్టాపూర్‌ శివార్లలో కలకలం..

సిద్దిపేట జిల్లా దుబ్బాక సమీపంలోని చిట్టాపూర్‌ శివార్లలో కలకలం రేపింది ఓ కారు. హైవేకు దాదాపు 30 ఫీట్ల దూరంలో ఉన్న ఓ బావిలో తేలింది కారు వీల్. బావిలో కారు పార్ట్‌లను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకొని బావిలో నుంచి కారును బయటికి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుకు 30 ఫిట్ల దూరంలో ఉన్న బావి లో కారు పడింది అంటే, ఆ కారు ఎంత స్పీడ్‌లో ఉందో అన్న డిస్కషన్ జరుగుతోంది. సీన్‌ను ఊహిస్తే, కారు అదుపుతప్పి రోడ్డు పైనుంచి కిందకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. బావి బయట కారు సైలెన్సర్, కారు వీల్ పార్ట్స్ ఉంటే, కారు టైరు ఒకటి నీటిలో తేలియాడుతూ కనిపిస్తోంది. బావి లోతు 50 ఫీట్లు ఉండగా, 20 ఫీట్ల వెడల్పు ఉంది.

ఈ కారు ప్రమాదం ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైవేపై ఎటువైపు వెళ్తున్నారు? అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? కారు బావిలో పడ్డాకా వీల్‌ ఊడిపోయిందా, లేక వీల్‌ ఊడిపోయాకే కారు బావిలో పడిందా.. కారును బావి నుంచి బయటకు తీస్తే కాని ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్‌ దొరకదు. మోటార్లతో బావిలో నీటికి బయటికి తోడుతున్నారు పోలీసులు. అయితే కారులో ఉన్న ఇద్దరు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే సహాయం చేసేందుకు వచ్చిన మరోకరు చనిపోవడం స్థానికుల్లో మరింత విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి: Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..