సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్.. తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం

|

Sep 01, 2021 | 4:56 PM

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్ చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్...

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్.. తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం
Women Angry On Thasildar
Follow us on

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్ చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దాంతో, కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడున్నవారంతా మహిళను అడ్డుకుని డీజిల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. తన భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేశారని… కొండపాక తహశీల్దార్ తమను మోసం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. లంచం తీసుకుని తమ భూమిని మరొకరి పేరుపై ఆన్ లైన్ చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. తమ భూమిని మరొకరి పేరుతో రాయడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తహశీల్దార్ బెదిరిస్తున్నాడని అంటోంది. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి అనే మహిళకు ఆరెపల్లెలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరుమీద  మార్చారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భర్త యాదగిరి, కుమారుడు భానుతో కలిసి వచ్చిన ఆమె… పెట్రోల్‌ పోసి తహసీల్దారు ఆఫీసును తగలబెట్టేందుకు యత్నించారు.

 గమనించిన తహసీల్దారు రామేశ్వర్‌ పోలీసులను అలెర్ట్ చేయడంతో కుకునూరుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను అడ్డుకున్నారు. భూ వివాదంపై కోర్టుకు వెళ్లాలని మహిళకు తహసీల్దారు సూచించారు. ఇకపై ఇక్కడ ఆందోళనకు చేయవద్దంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. తహసీల్దార్‌ ఆఫీసు వద్ద సుమారు రెండు గంటల పాటు హైటెన్షన్ కొనసాగింది.

Also Read: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్లు

అయ్యో..! ఇంత చిన్న కారణానికే ఆత్మహత్యా.. చర్చనీయాంశమైన టీనేజర్ సూసైడ్