హైదరాబాద్ లో ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో సురేఖ అనే అమ్మాయి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తన కుటుంబ సభ్యులు ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. కానీ సురేఖ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..