సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్ అనే రెండేళ్ల బాలుడి తలపై బండరాయి పడటంతో అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కట్కూరికి చెందిన దేవునురి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే వారికి స్లాబు గదులతో పాటు రేకులతో కూడిన వంటశాల ఉంది. ఈ రెండింటికీ మధ్య గాలి, వెలుతురు కోసం ఉన్న ఖాళీ ప్రదేశంపై తడక పెట్టి గాలికి ఎగిరిపోకుండా దానిపై ఓ బండరాయిని పెట్టారు.
అయితే సోమవారం రోజున కోతులు వాళ్ల ఇంటి లోపలికి ప్రవేశించాయి. వీటిన గమనించిన రజిత కోతులను బయటకు వెళ్లగొట్టేందుకు వంటింట్లోకి వెళ్లింది. ఆమె వెంటే అభినవ్ కూడా ఉన్నాడు. అయితే బయట నుంచి మార్గం నుంచే వెళ్లడానికి ఆ కోతులు తడకపైకి దూకాయి. దీంతో అక్కడ ఉన్న బండ రాయి కదిలి కింద ఉన్న అభినవ్ తలపై పడింది. ఆ బాలుడు తలపగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో విషయం ఏంటంటే నెలరోజుల క్రితమే ఇంట్లో కాలుజారి పడిపోయాడు. అతని గొంతుకి కత్తి తగలడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రూ.4 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించి బాలుడ్ని బతికించుకున్నారు. కానీ మళ్లీ ఇప్పడు కోతుల వల్ల అభినవ్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..