వామ్మో.. వీళ్ళు టీచర్లు కాదు.. వీరు చేసిన పని తెలిసి ఉన్నతాధికారులే షాక్!
మన సమాజంలో గురువులను దేవుడితో సమానంగా భావిస్తుంటాం. అలాంటి గురువులు, ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ క్రమశిక్షణను నేర్పించాలి. కానీ కొందరు ఉపాధ్యాలయలు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరు చేసిన పని తెలిసి ఉన్నతాధికారులే విస్తుపోయారు. అధ్యాపక వృత్తిలో ఉంటూ వీరు సాగించి బాగోతం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా చందంపేట మండలం కొర్రతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా పర్వీన్ సుల్తానా విధులు నిర్వర్తిస్తోంది. ఈ పాఠశాలలో సరిపడా విద్యార్థులు లేకపోవడంతో గత ఏడాది టీచర్ పర్వీన్ సుల్తానాను డిప్యుటేషన్‌పై గాగిళ్లాపురం యూపీఎస్ కు బదిలీ చేశారు. ప్రతిరోజు స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన పర్వీన్ సుల్తానా స్కూల్ కు డుమ్మా కొట్టింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడాది పాటు విధులకు హాజరు కాలేదు. టీచర్ పర్వీన్ సుల్తానా పాఠశాలకు రాకపోయినా ఆమె హాజరు మాత్రం ఫుల్‌గా ఉండేది. అప్పుడప్పుడు దేవరకొండకు వెళ్లినప్పుడు అటెండెన్స్ రిజిస్టర్‌లో ఆమె సంతకాలను హెచ్ఎం వేణుమాధవ్ తీసుకునేవాడు. దీంతో పోలేపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం సామ్యానాయక్ ఆమెకు నెలనెలా వేతనాన్ని మంజూరు చేశారు.
స్కూల్‌కు డుమ్మా కొడుతూ ప్రతి నెలా ఫుల్ శాలరీ తీసుకుంటూ సుల్తానా దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేసింది. సుల్తానాకు వచ్చిన జీతంలో కొంత శాలరీని వేణు మాధవ్, సామ్యా నాయక్ పంచుకునేవారు. బడి దొంగల వ్యవహారంపై డీఈవో భిక్షపతికి ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో పర్వీన్ సుల్తానాపై విద్యా శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. బడి దొంగల వ్యవహారంలో అవినీతికి పాల్పడిన హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ఛార్జ్ ఎంఈవోగా ఉన్న సామ్యా నాయక్ను కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విద్యా బుద్ధులు నేర్చాల్సిన ఉపాధ్యాయులే విధుల పట్ల బాధ్యతారాహిత్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.