ఇంటర్ అయిపోగానే చాలామంది విద్యార్థులు ఎంసెట్ కోసం సన్నద్ధమవుతుంటారు. పరీక్ష రాసేవరకు పుస్తకాలతో కుస్తీ పడతారు.కొంతమంది ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటారు. మరికొందరు ఏ కోచింగ్ తీసుకోకుండానే రాసేస్తుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం సరదాగ ఎంసెట్ పరీక్ష రాశాడు. కానీ ఫలితాలు చూశాక అతని ఊహించని రేంజ్‌లో ర్యాంక్ వచ్చేసింది. ఇంకెముంది బంధుమిత్రులందరు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రీతం ఇటీవల నీట్ పరీక్ష రాశాడు.
ఓ వైపు నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తూనే మరోవైపు ఎంసెట్ కోసం సిద్ధమయ్యాడు. ఇటీవల వచ్చిన ఎంసెట్ ఫలితాలు మాత్రం అతనికి ఆశ్చర్యం కలిగించాయి. ఏకంగా పదో ర్యాంక్ రావడంతో తన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రీతంకు మాత్రం వైద్య విద్య అభ్యసించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇతని తండ్రి హర్షవర్ధన్ న్యూరోసర్జన్, తల్లి శాంతి గైనకాలజిస్టు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వైద్యులు కావడంతో వారి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రీతం తెలిపాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.