Telangana: ‘ఇంటికి వెళ్తే నాన్న కొడుతున్నాడు.. నేను వెళ్లను’.. స్కూళ్లోనే దాక్కున్న చిన్నారి!

మద్యానికి బానిసైన భర్త, భార్య మీద కోపాన్ని కూతురుపై చూపించాడు. ఇంటి రాగానే కన్నకూతురును దెబ్బలు కొడుతూ, ఎవరికైనా అమ్మేస్తాననీ బెదిరించాడు.

Telangana: 'ఇంటికి వెళ్తే నాన్న కొడుతున్నాడు.. నేను వెళ్లను'.. స్కూళ్లోనే దాక్కున్న చిన్నారి!
Student Hides Inschool
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Oct 25, 2024 | 6:07 PM

సాధారణంగా పిల్లలకు నాన్నే రోల్‌ మోడల్‌. ముఖ్యంగా ఆడ పిల్లలకు అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా అనుబంధం ఉంటుంది. వారికి తండ్రే తొలి హీరో అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఈ బాలిక మాత్రం తండ్రి పేరు చెబితేనే.. వణికిపోతోంది. ఇంటికి వెళ్ళేదీ లేదంటూ మారాం చేస్తోంది. ఆ బాలికకు ఏమైంది..? తండ్రిని చూసి ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్‌కు చెందిన అక్బర్ దంపతులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగడ్డలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త, కూతురుని వదిలి తన కుమారుడితో కలిసి తల్లి గారింటికి వెళ్ళిపోయింది భార్య. కూతురు స్థానిక ప్రాధమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన అక్బర్ భార్య మీద కోపాన్ని కూతురుపై చూపిస్తున్నాడు. ఇంటి రాగానే దెబ్బలు కొడుతూ, ఎవరికైనా అమ్మేస్తాననీ బెదిరించాడు.

తండ్రి భయంతో స్కూల్ వచ్చిన బాలిక తోటి విద్యార్థులతో విషయం చెప్పింది. ఇంతలోనే మద్యం మత్తులో ఉన్న అక్బర్ కూతురుని తీసుకువెళ్లడానికి స్కూలుకు వచ్చాడు. తాను తండ్రితో వెళ్ళనని.. తనను అమ్మేస్తానని బెదిరిస్తున్నాడని భయంతో వణికిపోయింది. అయితే, తన కూతురిని తనతో పంపించాలని ఉపాధ్యాయులతో గొడవకు దిగాడు. విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కు అప్పగించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..