AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: కాళ్లు బయట.. బాడీ లోపల.. లిఫ్టులో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డ్‌.. గంట పాటు నరకయాతన

నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు

Nizamabad: కాళ్లు బయట.. బాడీ లోపల.. లిఫ్టులో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డ్‌.. గంట పాటు నరకయాతన
Security Guard In Lift
Prabhakar M
| Edited By: Basha Shek|

Updated on: Jan 17, 2024 | 2:16 PM

Share

నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరితో ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు గంటసేపు లిఫ్టులోనే కాళ్ళు బయట బాడీ లోపల ఉండి ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ ను ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం దాదాపు అర గంట సేపటికి పైగా ప్రయత్నించి ఆయనను ప్రాణాలతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో HDFC హౌసింగ్ లోన్ బ్యాంక్ లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్ రూముకు లిఫ్ట్ లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో కాళ్లు బయట పెడుతున్న క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు. సుమారు గంట పాటు అరుపులు కేకలు పెట్టాడు. స్థానికులు అతనిని గమనించి హైదరాబాద్ లోని ఫైర్ సహాయక సెంటర్ కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన నిజామాబాద్ ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అరగంటలో అతన్ని బయటకు తీశారు.

కాగా గత కొన్ని రోజులుగా లిఫ్టు సరిగ్గా పనిచేయడం లేదని ఇలాగనే రెండు మూడు సార్లు మధ్యలోనే ఆగిపోవడంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్ చేసి ఆగిపోయిన లిఫ్ట్ ను బాగు చేసి సిబ్బందిని బయటకు తీసిన ఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెప్పుకొచ్చారు. అలాగే ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న దావత్ హోటల్లో సిలిండర్లు పెళ్లి భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పడంతో అప్పట్లో కూడా అనేకమంది ప్రాణాలను ఇదే ఫైర్ సిబ్బంది కాపాడారు. కానీ ఈ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై స్థానికులు ఫైర్ ఆఫీసర్ల పై మండిపడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు రెండు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా షాపింగ్ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఫైర్ స్టేషన్ అధికారులు యజమానిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని ఫైర్ సేఫ్టీ తతర లిఫ్ట్ లోపాల సవరణపై సమగ్రంగా దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు

లిఫ్టులో సెక్యూరిటీ గార్డు..

ఇవి కూడా చదవండి