Telangana: తల్లితో గొడవ పడుతుందని నానమ్మను కత్తితో పొడిచిచంపిన మైనర్ బాలుడు..!

| Edited By: Balaraju Goud

Apr 15, 2024 | 6:49 PM

జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనవడి చేతిలో నానమ్మ దారుణ హత్యకు గురైంది. తన తల్లితో నిత్యం గొడవ పడుతుందనే అక్కసుతో నానమ్మను కత్తితో పొడిచి చంపాడు 14 ఏళ్ల మైనర్ బాలుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Telangana: తల్లితో గొడవ పడుతుందని నానమ్మను కత్తితో పొడిచిచంపిన మైనర్ బాలుడు..!
Murder
Follow us on

జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనవడి చేతిలో నానమ్మ దారుణ హత్యకు గురైంది. తన తల్లితో నిత్యం గొడవ పడుతుందనే అక్కసుతో నానమ్మను కత్తితో పొడిచి చంపాడు 14 ఏళ్ల మైనర్ బాలుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ దారుణ ఘటన జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మామిడ్ల ఎల్లమ్మ అనే వృద్ధురాలు కొడుకు సమ్మయ్య ఇంట్లో నివాసం ఉంటోంది. గత కొద్దిరోజుల క్రితం కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో కోడలు రజిత, మనవడితో కలిసి ఉంటుంది. అయితే అత్తా కోడలు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తన నానమ్మ వల్లే తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నెపంతో సమ్మయ్య కుమారుడు 14 ఏళ్ల మైనర్ బాలుడు కసితో రగిలి పోయాడు. ఎల్లమ్మ నిద్రిస్తున్న క్రమంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

మనవడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మైనర్ బాలుడి నిర్వాకం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..