ఫైనాన్స్ కోసం వారి ఐడీ రుజువులను తీసుకుంటారు. వారికి తెలియకుండానే వెహికల్స్ తీసుకుంటారు. గుట్టుచప్పుడు కాకుండా ఆమ్మే జల్సాలు చేస్తారు. ఇలా ఈవి వాహనాలు కాజేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.44.80 లక్షలు విలువ చేసే 27 టీవీఎస్ ఖ్యూబ్, సుజుకి Burgman వాహనాలను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వివిధ షోరూమ్‌లు, ఫైనాన్స్ కంపెనీల నుండి కొనుగోలు చేశారు. ఇతర వ్యక్తుల ID రుజువులను ఉపయోగించి వాహనాలు కోనుగోలు చేస్తున్నారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫైనాన్స్‌లో ఇతర ఐడీ ప్రూఫ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఇలా కొనుగోలు చేసిన వాహనాలనను అధిక ధరలకు విక్రయించడం, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ రాయితీలను పొందుతున్నారు కేటుగాళ్లు.
హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన మీర్జా బకర్ అలీ బేగ్, బహదూర్ పురాకు చెందిన సయ్యద్ తన్వీర్, మలక్ పేటకు చెందిన సచిన్ .జాఫర్ అలీ మూస్వీ సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు, అమ్మకం వ్యాపారంలో భాగస్వాములు. తమ సంస్థలో ఆర్థిక ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటున్న వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న మలక్ పేటకు చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సకాలంలో ఫైనాన్స్ వాయిదాలను కవర్ చేస్తామని నమ్మించి బాధితులను మోసం చేస్తున్నారు. కొద్ది మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి అమాయక, నిరక్షరాస్యుల ID రుజువులను ఉపయోగించి ఫైనాన్స్‌పై ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. తరువాత, వాహనాన్ని ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయని, వారు వాహనంపై ఫైనాన్స్ క్లియర్ చేశారని, త్వరలో వారు వాహనాన్ని వారి పేరుపై బదిలీ చేస్తారని చెప్పడం ద్వారా అవసరమైన వినియోగదారులకు తక్కువ ధరలకు అదే వాహనాలను విక్రయిస్తున్నారు.
వారి ఫ్లాన్‌లో భాగంగా పరిచయస్తులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆకర్షించి, ఫైనాన్స్ కోసం వారి ID రుజువులను సేకరించి, 27 ఎలక్ట్రిక్ వాహనాలను వివిధ షోరూమ్‌ల్లో ఫైనాన్స్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇలా L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, TVS క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్, IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొటించారు. ఈ వాహనాలను అవసరమైన కస్టమర్లకు తక్కువ ధరలకు విక్రయించారు. ఆరు నెలల తర్వాత, ప్రభుత్వ సబ్సిడీలు అసలు వాహన యజమానుల బ్యాంకు ఖాతాలకు జమ కాగానే, నిందితులు వారికి కొంత సబ్సిడీ మొత్తాలను అందజేస్తామని మోసం చేశారు. ఈ ముఠా గుట్టును ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. మలక్ పేట పోలిసులసహాయం తో ఛేదించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..