Maoist Dump: తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు.. సరిహద్దు అటవీ ప్రాంతంలో బయటపడిన డంప్..!

Adilabad Maoist Dump: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు..

Maoist Dump: తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు.. సరిహద్దు అటవీ ప్రాంతంలో బయటపడిన డంప్..!
Maoist Dump

Updated on: Sep 01, 2022 | 9:50 AM

ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. మహారాష్ట్ర సరిహద్దు కైలాష్ టెక్ది ప్రాంతంలో గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అడెళ్లు దళం సంచారం నేపథ్యంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడు పదార్థాలు లభ్యమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంలోని గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ఇదిలావుంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం.. దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..