Telangana: కూతురు పెళ్లికోసం బంగారు పట్టుచీర.. మన సిరిసిల్ల నేతన్న చేతితో మరో అద్భుతం..!

ఆరు నెలల నుంచి బంగారు, పట్టు జరి పోగులు తయారు చేస్తున్నారు నేత కార్మికుడు విజయ్. సుమారుగా నాలుగు నెలలకు పైగా సమయం పట్టింది. తర్వాత చీరకు జకాత్ డిజైన్ తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టింది.

Telangana: కూతురు పెళ్లికోసం బంగారు పట్టుచీర.. మన సిరిసిల్ల నేతన్న చేతితో మరో అద్భుతం..!
Sirisilla Weaver Vijay Kumar Golden Saree
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 29, 2024 | 1:34 PM

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త తన కూతురు వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా తన కూతురు కోసం బంగారు చీర కొనాలనుకున్నారు. ఏకంగా చేనేత ద్వారా చీర నేయిస్తున్నారు. ఇందు కోసం గత ఆరు నెలల క్రితం సిరిసిల్ల కు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్ కి ఆర్డర్ ఇచ్చారు సదరు వ్యాపారవేత్త.

ఆరు నెలల నుంచి బంగారు, పట్టు జరి పోగులు తయారు చేస్తున్నారు నేత కార్మికుడు విజయ్. సుమారుగా నాలుగు నెలలకు పైగా సమయం పట్టింది. తర్వాత చీరకు జకాత్ డిజైన్ తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టింది. విజయ్ జాకట్ సాంచే పై తయారు చేయడానికి 15 రోజుల ఎంతో శ్రమపడి బంగారు పట్టు చీర తయారు చేశారు. చీర వెడల్పు 49 ఇంచులు పొడవు, 5.5 మీటర్లు, బరువు 9 వందల గ్రాములువుంది. చీర ఖరీదు సుమారుగా 18 లక్షలు రూపాయలు అవుతుందని అంచనా. నమ్మకంతో బంగారు చీర నేయాడానికి ఆర్డర్ ఇచ్చిన వ్యాపారవేత్తకు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు విజయ్ కుమార్.

దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో పట్టుచీరలు నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన నల్ల పరందాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచి మగ్గాలపై వినూత్న ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు

సంచల పై వస్త్ర ఉత్పత్తి సాగించే విజయ్ కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తర్వాత ఉంగరం నుంచి దూరే చీర నుంచి కుట్టులేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చి, పైజామా, అరటి నారాలతో శాలువా, తామరలతో చీర, వెండి కొంగులతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయకుమార్ సంప్రదించి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారు చేయించి తమ వారికి బహుమతులు ఇస్తుంటారు. విజయ్ కుమార్ వద్ద పన్నెండు వేలకు కొని తిరుమల శ్రీవారికి బహుకరించారు. అమెరికా, న్యూజీలాండ్, బెంగళూరు, హైదరాబాద్ చెందిన వస్త్ర వ్యాపారులు నేరుగా ఆర్డర్ ఇచ్చి విభిన్న వస్త్రాలు తయారు చేయించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక