Mythri Clinic: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకం.. అందుబాటులోకి ఉచిత వైద్య సేవలు..

ట్రాన్స్‌జెండర్లు గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వారిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వాలంటీర్లుగా నియమిస్తామని ప్రకటించగా, మైత్రి క్లినిక్ ల పేరుతోప్రత్యేక వైద్యసేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Mythri Clinic: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకం.. అందుబాటులోకి ఉచిత వైద్య సేవలు..
Mythri Clinic For Transgenders
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 29, 2024 | 12:54 PM

ట్రాన్స్‌జెండర్లు గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వారిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వాలంటీర్లుగా నియమిస్తామని ప్రకటించగా, మైత్రి క్లినిక్ ల పేరుతోప్రత్యేక వైద్యసేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మహిళలు, పురుషుల కోసం వైద్యులు సేవలందిస్తున్నాయి. అదే మాదిరిగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్ పేరుతో వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు క్లినిక్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డు, ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు.

వారంలో రెండు రోజులు ఓపీ సేవలు..

జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్న మైత్రి క్లినిక్ లో వారంలో రెండు రోజులు ఓపీ సేవలందించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు.. అందనున్నాయి. ఒకవేళ క్లినిక్ కు వచ్చే వాళ్ల సంఖ్య పెరిగితే దాన్ని బట్టి పని దినాల సంఖ్య పెంచాలని వైదాధికారులు భావిస్తున్నారు.

మైత్రి క్లినిక్ లలో ప్రత్యేక వైద్య సిబ్బంది..

ట్రాన్స్ జెండర్లకు మైత్రి క్లినిక్ లో సేవలందించేందుకు ప్రత్యేకంగా వైద్యులను నియమించారు. మొత్తం ఐదుగురు డాక్టర్లను నియమించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గైనకాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, జనరల్ ఫిజిషియన్, నర్సు ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. వైద్యులు రాసి ఇచ్చే మందులను తీసుకునేందుకు సైతం ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య సేవల కోసం వచ్చే ట్రాన్స్ జెండర్లను ఎలా రిసీవ్ చేసుకోవాలి. వారితో మాట్లాడే విధానం తదితర విషయాలపై ప్రత్యేకంగా నియమించిన వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు.

మైత్రి క్లినిక్ ల ఏర్పాటుపై ట్రాన్స్ జెండర్ల సంతోషం…

తమ కోసం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ట్రాన్స్ జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లాలంటే ఇబ్బంది ఉండేదని, జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్లినా ఇబ్బందులు ఎదురయ్యేవనీ ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. మైత్రి క్లినిక్ లతో తమకు వైద్య సేవల కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రపంచంలోనే అందమైన కుర్రాడు ఎవరో తెలుసా..
ప్రపంచంలోనే అందమైన కుర్రాడు ఎవరో తెలుసా..
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో