పాఠశాలకు వెళ్తూ.. నడిరోడ్డులో కుప్పకూలిన విద్యార్థిని.. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి షాక్..!
చిన్నా పెద్దా తేడా లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. మారుతున్న ఆహారపుటలవాట్లని కొందరు.. ఫిజికల్ ఎక్సర్‌సైజులు తిరగబడ్డం వల్ల అని మరికొందరు, మితిమీరిన స్టెరాయిడ్సే కొంప ముంచుతున్నాయని, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనీ రకరకాల కారణాలు చెబుతారు. రీజన్ ఏదైనా గుండెపోటు మరణాలు దడ పుట్టిస్తున్నాయి.

గుండెపోటు మరణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఒకప్పుడు 60ఏళ్లు పైబడ్డ వారికే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు.. ఏ క్షణమైనా ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ వస్తోంది. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కూలిపోతున్నారు. పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని ఒక్కసారిగా గుండెపోటు వచ్చి రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయింది. బాలికను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది.
రామారెడ్డి మండలం సిగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి(14) కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. విద్యార్థిని పెద్ద నాన్న కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ కాలనిలో నివాసం ఉండగా, అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది. ఎప్పటిలాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా జీవధాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అయినా వైద్యులు సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో అటు సింగరాయిపల్లి గ్రామం, ఇటు పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థినిని తాము కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…