Hanumakonda: విషాదం.. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి

|

May 24, 2023 | 7:05 AM

ప్రమాదం ఎటునుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఊహించని రీతిలో మృత్యువు కళ్ల ఎదుట నిలుస్తుంది. వేసవిలో ఉక్కపోత తాళలేక పల్లె జనాలు చెట్ల నీడన సేద తీరడం షరా మామూలే. ఆరుబయట చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారిపై ఉన్నట్టుండి..

Hanumakonda: విషాదం.. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి
Srija
Follow us on

ప్రమాదం ఎటునుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఊహించని రీతిలో మృత్యువు కళ్ల ఎదుట నిలుస్తుంది. వేసవిలో ఉక్కపోత తాళలేక పల్లె జనాలు చెట్ల నీడన సేద తీరడం షరా మామూలే. తాజాగా ఆరుబయట చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారిపై ఉన్నట్టుండి చెట్టు కొమ్మ విరిగి పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన కన్నా సురేందర్‌, రజిత దంపతులకు కుమారుడు సిద్ధు, కూతురు శ్రీజ (9) సంతానం. సురేందర్‌ గీత కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వేసవికాలం కావడంతో ఇంట్లో ఉక్కపోతగా ఉంటుందని సురేందర్‌ కుటుంబ సభ్యులందరూ ఆరుబయట చెట్టు కింద నిద్రించడం అలవాటు. వీరి ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓ వేప చెట్టు ఉంది. దాని కొమ్మలు వీరి ఇంటిపై వాలి ఉంటాయి.

జు మాదిరిగానే సోమవారం రాత్రి కూడా ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఈదురుగాలులు వీశాయి. ఈ దాటికి చెట్టు కొమ్మ విరిగి మంచంపై నిద్రిస్తున్న సిద్ధూ, శ్రీజపై పడింది. ఈ ఘటనలో శ్రీజ తలకు బలమైన గాయమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే శ్రీజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.