గత కొంతకాలంగా పిచ్చి కుక్కల దాడులు పెరిగిపోయాయి. ప్రధానంగా వేసవి కాలం వచ్చిన తర్వాత వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో వేలాది కుక్కలు ఉన్నట్టు అంచనా. ప్రతి సంవత్సరం పిచ్చికుక్కల సంఖ్య పెరుగుతూనే ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నమోదైన కుక్కకాట్లే నిదర్శనమని అంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
యాచారంలోనీ ఎల్లమ్మ గుడి కాలనీ లో ఓ పిచ్చికుక్క పలువురి పై దాడి చేసింది. పిచ్చికుక్క దాడి చేసి 9 మందిని కరిచింది. తొమ్మిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే యాచారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందించారు. అప్రమత్తమై స్థానికులు స్వైర విహారం చేసిన పిచ్చికుక్కను గ్రామస్తులు చంపివేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..