ఈ నెల 17న రూ.7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించిన కారు డ్రైవర్ శ్రీనివాస్…. కూకట్‌పల్లి సమీపంలో ఉన్న మెట్రో షాపింగ్ మాల్ పార్కింగ్‌లో కారును వదిలేశాడు. బంగారం, వజ్రాభరణాలను బ్యాగ్‌లో సర్దేసి… ఆటో ఎక్కి హైటెక్ సిటీలో రాధిక ఉండే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ పార్కింగ్‌లో ఉంచిన తన బైక్‌పై శంషాబాద్ చేరుకొని శ్రీశైలం హైవే రూట్‌లో వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. రాధిక ఏటీఎం కార్డును ఉపయోగించి కొత్త సెల్‌ఫోన్, సిమ్ కార్డు కొన్నాడు శ్రీనివాస్. తర్వాత… వరంగల్ సమీపంలోని నర్సంపేటలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. చోరీ చేసివచ్చిన విషయాన్ని బంధువుకు చెప్పలేదు. ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. కొత్తఫోన్, కొత్తసిమ్‌ను బంధువుకు ఇచ్చి.. అతడి ఫోన్‌ను సిమ్‌కార్డును శ్రీనివాస్ తీసుకున్నాడు.
బంగారు వజ్రాభరణాలను కారు డ్రైవర్ శ్రీనివాస్ చోరీచేసి పారిపోయాడని న్యూస్ చానళ్ళ లో చూసిన బంధువు.. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కంగారు పడొద్దని బంధువును శ్రీనివాస్ సముదాయించాడు. హైదరాబాద్ నుంచి పారిపోయిన శ్రీనివాస్ తన స్వస్థలమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చేరాడు. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన కొయ్యలగూడెం వెళ్లి అక్కడ అడవిలో.. గొయ్యి తీసి… కాజేసి తెచ్చిన రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గోతిలో దాచి పెట్టాడు.
ఇప్పటి వరకు అన్ని విషయాల్లో.. సినీ ఫక్కీలో ప్లాన్ చేసుకున్న శ్రీనివాస్.. చిన్న తప్పుతో దొరికిపోయాడు. రాధిక ఏటీఎం కార్డు స్వెయిప్ చేసి కొత్త సిమ్ కొనడంతో .. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శ్రీనివాస్ ని పట్టుకున్నారు. బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగలకు సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది . పూర్తి వివరాలను రాబట్టిన తర్వాత నిందితుడు శ్రీనివాస్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
చీరలు, జాకెట్లు, వన్ గ్రామ్ గోల్డ్ అమ్మినట్లు .. కోట్ల రూపాయల నగలను వాట్సప్ మెసేజెస్ తో అమ్ముతొంది రాధిక. వీటికి బిల్లులు.. లెక్కాపత్రం కూడా ఉండదు. ఈ విషయం పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..