వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు.. ఐక్యమత్యంతో‌ అంతా సేఫ్..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 27, 2023 | 6:26 AM

Mancherial District: ఐకమత్యమే మహాబలం అన్న మాటను‌ అక్షరాల నిజం చేశారు ఆ కార్మికులు. భారీ వర్షాలతో వరద ఉదృతి పెరగడంతో త్వరగా ఇళ్లు చేరాలన్న ఆతృతతో ఉదృతితో పారుతున్న వాగును‌దాటే ప్రయత్నం చేశారు ఆరుగురు

వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు.. ఐక్యమత్యంతో‌ అంతా సేఫ్..
Spot Visuals
Follow us on

మంచిర్యాల జిల్లా, జూలై 27: ఐకమత్యమే మహాబలం అన్న మాటను‌ అక్షరాల నిజం చేశారు ఆ కార్మికులు. భారీ వర్షాలతో వరద ఉదృతి పెరగడంతో త్వరగా ఇళ్లు చేరాలన్న ఆతృతతో ఉదృతితో పారుతున్న వాగును‌దాటే ప్రయత్నం చేశారు ఆరుగురు వ్యక్తులు. కానీ వాగు వరద ప్రవాహం మరింత పెరగడంతో వరదలో చిక్కుకున్నారు. వరద ఉదృతికు కొట్టుకుపోయే ప్రమాదంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఐక్యమత్యంతో బతుకు‌ జీవుడా అంటూ ఒడ్డు చేరారు. ఈ ఘటన మంచిర్యాల జైపూర్ మండలం పెగడపల్లి‌వద్ద చోటు‌ చేసుకుంది. జైపూర్ ఎన్టీపీసీ ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న పెగడపల్లికి చెందిన ఆరుగురు కార్మికులు డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరారు. అదే సమయంలో పెగడపల్లి వాగు కు వరద పోటెత్తింది.

నిత్యం‌ రాకపోకలు సాగించే వాగే కావడంతో ధైర్యంగా ఆరుగురు వాగు దాటే ప్రయత్నం చేశారు. మధ్యలో వెళ్లగానే వరద ఉదృతి పెరగడంతో ఇద్దరు కార్మికులు వరదలో కొద్ది దూరం కొట్టుకు పోయారు. వెంటనే అలర్ట్ అయిన మిగిలిన కార్మికులు వరదలో కొట్టుకుపోతున్న కార్మికులను గట్టిగా పట్టుకుని కాపాడారు. వరద ఉదృతి అంతకంతకు పెరగడంతో ముందుకు వెళ్లలేమని నిర్ణయించుకున్న ఆరుగురు కార్మికులు ఒకరి చేతులు‌ ఒకరు పట్టుకుని జాగ్రత్తగా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..