ఈసీఐఎల్ కంపెనీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కంపెనీ క్యాంటీన్ లో శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో పాము ప్రత్యక్షమైంది. ఈ విషయం తెలియక అప్పటికే సాంబార్ తిన్నారు పలువురు ఉద్యోగులు. లంచ్ సమయం ముగిసిన వెంటనే పాము పడిన సాంబార్ ను తిన్న నలుగురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే సాంబార్లో పామును గుర్తించిన మిగతా సిబ్బంది కూడా షాక్ లో ఉండిపోయారు.. ఈసీఐఎల్ లాంటి పెద్ద సంస్థ క్యాంటీన్ లో పాము ఎక్కడి నుండి వచ్చిందనే ఆందోళనలో ఉన్నారు అందరూ. అది కూడా సాంబార్లో పాము ప్రత్యక్షం కావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ECIL) హాస్పిటల్కు సిబ్బందిని తరలించి చికిత్స అందిస్తున్నారు. సమ్మర్దిన్న నలుగురిని కూడా అదే హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. అయితే సాంబార్ లోకి పాము ఎలా వచ్చిందనే అంశంపై క్యాంటీన్ నిర్వహకులు విస్తుపోతునారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..