Telangana: సంగారెడ్డి జిల్లాలో బావి నీళ్లు తాగి 30 మందికి అస్వస్థత.. ఇద్దరు మృతి

|

Oct 13, 2024 | 9:44 AM

సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం సంజీవ‌రావుపేట్‌లో ప‌లువురు అస్వస్థత‌కు గుర‌య్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థత‌కు గుర‌య్యారు. బావి నీళ్లు తాగిన కాసేప‌టికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచ‌నాల‌కు గుర‌య్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు..

Telangana: సంగారెడ్డి జిల్లాలో బావి నీళ్లు తాగి 30 మందికి అస్వస్థత.. ఇద్దరు మృతి
Well Water
Follow us on

సంగారెడ్డి, అక్టోబర్‌ 13: సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం సంజీవ‌రావుపేట్‌లో ప‌లువురు అస్వస్థత‌కు గుర‌య్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థత‌కు గుర‌య్యారు. బావి నీళ్లు తాగిన కాసేప‌టికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచ‌నాల‌కు గుర‌య్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వీరిని హుటాహుటీన పలు ఆస్పత్రులకు తరలించగా.. వైద్యులు చికిత్స ప్రారంభించారు. కలుషిత నీరు తగిన వారిలో ఇద్దరు మృతి చెందగా… పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మృతులను మహేష్ (22), సాయమ్మ (70)గా గుర్తించారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.

బావిలోని నీరు తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. బాధితుల కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌మాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమ‌త్తమయ్యారు. అస్వస్థకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయ‌ణ‌ఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల‌కు త‌ర‌లించారు. గ్రామస్థుల పాలిట యమపాశంలా మారిన బావి నీళ్లను ఎవరూ తాగకూడదంటూ అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.