KTR: మెడిసిన్ ‘బ్లాక్ మార్కెటింగ్’పై ఉక్కుపాదం.. రాష్ట్రంలో 258 మంది అరెస్ట్.. మంత్రి కేటీఆర్ ట్వీట్..

|

May 21, 2021 | 6:05 AM

258 arrested in Telangana: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుండటంతో

KTR: మెడిసిన్ ‘బ్లాక్ మార్కెటింగ్’పై ఉక్కుపాదం.. రాష్ట్రంలో 258 మంది అరెస్ట్.. మంత్రి కేటీఆర్ ట్వీట్..
KTR
Follow us on

Black marketing of Covid-19 medicines: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుండటంతో కొందరు అక్రమార్కులు కరోనా చికిత్సలో ఉపయోగించే మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కోవిడ్-19 మందులు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్‌కు పాల్పడిన 258 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 123 కేసులు నమోదు చేశారు. అలాంటి వారు ఎవరున్నా ఉపేక్షించవద్దని.. కఠినంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే.. ఈ విషయంపై మునిసిపల్, పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్ చేశారు.

కోవిడ్-19 మందులు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టవేసేందుకు తెలంగాణ పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. అలాంటి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా 128 కేసులు నమోదయ్యాయని.. 258 మందిని అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి దందాలకు పాల్పడుతున్న వారి సమాచారం ఉంటే.. ఎవరైనా 100 నెంబర్‌కు డయల్ చేయవచ్చని.. లేదా డీజీపీకు ట్వీట్ చేయవచ్చని సూచించారు. కాగా ఇటీవల కాలంలో కరోనా సోకిన వారికి అత్యవసర చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధాల కోసం చేస్తున్న ట్విట్లకు మంత్రి కేటీఆర్ తొందరగా స్పందించి వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.

దీంతోపాటు మంత్రి కేటీఆర్ డీఆర్డీఓ తయారు చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2DG) గురించి కూడా ట్విట్ చేశారు. ఈ ఔషధం ఇంకా మార్కెట్లోకి రాలేదని.. నకిలీ ఔషధాన్ని కొనుగులు చేసి మోసపోవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ ప్రకటనను పంచుకున్నారు.

Also Read:

CM KCR: వరంగల్‌లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన.. ఎంజీఎం, సెంట్రల్ జైలు సందర్శన

Telangana Coroana: తెలంగాణలో తగ్గముఖం పడుతున్న కరోనా కేసులు.. కొత్తగా 3660మందికి పాజిటివ్