Road Accident: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 25 మందికి తీవ్ర గాయాలు.. నలుగురి పరిస్థితి..

Nirmal Road Accident: తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తిమ్మాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.

Road Accident: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 25 మందికి తీవ్ర గాయాలు.. నలుగురి పరిస్థితి..
Nirmal Road Accident

Updated on: Mar 07, 2022 | 8:15 PM

Nirmal Road Accident: తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తిమ్మాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భైంసా నుంచి నిర్మల్‌ వెళ్తున్న బస్సును (RTC Bus) అదే మార్గంలో గొల్లమడ వైపు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో 15 మంది వరకు స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అంబకంటికి చెందిన గోదావరి, చిన్నత్తకు కాళ్లు విరగడంతో వారిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఒక గూడ్లగూబ దాగి ఉంది.. కనిపెడితే మీరే జీనియస్..