
స్మశానం మీదుగా వెళ్లే రహదారిలో నడిచి వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఇద్దరు మహిళలు రాత్రి, పగలు లేడా కూడా స్మశానంలో యధేచ్ఛగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. స్మశానంలో కాలుతున్న కాష్టాల నుంచి బూడిదను సేకరించి తీసుకెళ్తున్నారు. అది గమనించిన స్థానిక యువకుడు వారిని ఆరాతీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇప్పటికే సుల్తానాబాద్‌లో నెలరోజుల వ్యవధిలో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహిళలు స్మశానంలో సంచరించడం, బూడిద సేకరించడం స్థానికులలో అనుమానం రేకెత్తించింది. ఏమైనా క్షుద్రపూజలు చేస్తున్నారా? ఎముకలను ఎత్తుకెళ్తున్నారా అని ఆందోళన చెందుతున్నారు. మృతిచెందిన వారి అస్థికలు, బూడిదను పవిత్ర గంగానదిలో కలిపి వారికి ఈలోకం నుంచి విముక్తి కలిగిస్తారు కుటుంబ సభ్యులు. కానీ ప్రస్తుతం ఈ ఘటనతో కాష్టంలో ఎముకలు, బూడిద కూడా ఇలా చోరీకి గురవుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళలు మంచిర్యాలకు చెందినవారుగా గుర్తించారు. చనిపోయినవారి నోటిలో ఉంచే బంగారం కోసం వెతుకుతున్నామని మహిళలు తెలిపారు. తమకు ఏ పాపం తెలియదని అంటున్నారు. ఈ పనులు మానాలని.. స్థానికలు భయపడి దాడులు చేస్తారని… వారికి పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.