Memu Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివారు ప్రాంతాలను కలుపుతూ మెము రైళ్లు
హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ఏకంగా 16 రైలు సర్వీసులను(Memu Services) ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సేవలు శనివానం(నేటి) నుంచే పూర్తి స్థాయిలో...
హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ఏకంగా 16 రైలు సర్వీసులను(Memu Services) ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సేవలు శనివానం(నేటి) నుంచే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని వివరించింది. గత కొద్ది నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ వంద రూపాయలు దాటిపోగా, డీజిల్ వందకు చేరువలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వాహనాలను బయటకు తీసేందుకు ప్రజలు జంకుతున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న దక్షిణమధ్య రైల్వే (SCR) రూ.15కే 56 కిలోమీటర్లు ప్రయాణించేలా ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) అందుబాటులోకి తెచ్చింది. నగర శివార్లను కలుపుతూ ప్రారంభమయ్యే ఈ రైలు కనీస టిక్కెట్ ధర రూ.10, గరిష్ఠ టిక్కెట్ ధర రూ. 15 గా ఉంటుందని పేర్కొంది. నగర ఉత్తర – దక్షిణ ప్రాంతాలను కలిపేందుకు ఈ రైళ్లను పట్టాలెక్కిస్తున్నట్లు వివరించింది. మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి ఉందానగర్‌కు మొత్తం 56 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరాన్ని రైల్వే ప్రయాణికులకు చేరువ చేసింది. మేడ్చల్ – ఉందానగర్ మధ్య మొత్తం 56 కిలోమీటర్లు కాగా.. 25 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ దూరాన్ని చేరడానికి 2.25 గంటలు సమయం పడుతుంది.
సికింద్రాబాద్ – ఉందానగర్ మధ్య మొత్తం దూరం 28 కిలోమీటర్లు. సికింద్రాబాద్‌లో బయలుదేరిన రైలు సీతాఫల్‌మండి, ఆర్ట్స్ కళాశాల, జామై ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, ఎన్‌పీఏ శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లలో ఆగి చివరి స్టేషన్ ఉందానగర్‌కు చేరుకుంటుంది. మొత్తం ప్రయాణ సమయం ఒక గంట 25 నిమిషాలు. మేడ్చల్ – సికింద్రాబాద్ మధ్య మొత్తం 28 కిలోమీటర్లు. మేడ్చెల్‌లో బయలుదేరి.. గౌడవల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారంబజార్, అల్వాల్, కల్వారి బ్యారక్స్, అమ్ముగూడ, రామకిష్టాపురం గేట్, సఫిల్‌గూడ, దయానంద్‌నగర్, మల్కాజిగిరి మీదుగా ఈ రైలు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
నగర శివారు ప్రాంత ప్రయాణికులకు ఇతర రవాణాలతో పోల్చితే మెము రైలు ప్రయాణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో డిమాండ్‌కు తగ్గట్టు సర్వీసులు పెంచుతామని ఉన్నతాధికారులు తెలిపారు. టిక్కెట్లను స్టేషన్లలో గాని డిజిటల్ విధానం అంటే మొబైల్ ఫోనులో కొనుగోలు చేసుకోవచ్ఛని వెల్లడించారు.
Also Read
Local to Global Live: లోకల్ టూ గ్లోబల్.. ఫటా ఫట్ న్యూస్ సంక్లిప్తంగా మీ కోసం…(వీడియో)
‘Mishan Impossible’: విడుదలకు సిద్దమైన తాప్సీ సినిమా.. ‘మిషన్ ఇంపాజిబుల్’ వచ్చేది ఎప్పుడంటే..
Shanidev: శనిదేవుడి అనుగ్రహం లభించాలంటే శనివారం ఇలా పూజించండి..!